ys jagan |
కడప(వైఎస్ఆర్ జిల్లా): కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు 4 వేల రూపాయల చొప్పున ఇన్ పుట్ సబ్జిడి ఇవ్వడంతోపాటు మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని కరువు మండలాలలో ఈరోజు ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆయనకు చెప్పుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క వ్యక్తి వల్ల కరువు వస్తుందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నిరూపించారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రి డిఎల్ కి డిపాజిట్ దక్కలేదని బ్రహ్మసాగర్ నుంచి రావలసిన నీటిని అడ్డుకున్నారు. రబీ సీజన్ లో 32 లక్షల ఎకరాలు సాగు చేయవలసి ఉండగా, 17 లక్షల ఎకరాలలోనే సాగు చేసినట్లు ఆయన వివరించారు
కరువు మండలాల ప్రకటనలో జాప్యం: జగన్
కడప(వైఎస్ఆర్ జిల్లా): కరువు మండలాల ప్రకటనలో అలస్యం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. బద్వేలు, పోరుమామిళ్ల మండలాలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమగోడు ఆయనకు వినిపించారు. దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించిన తరువాత ఆయన మాట్లాడుతూ కరువు మండలాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు. రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇంతవరకు అందలేదని చెప్పారు. రైతుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసాలేదన్నారు. సేద్యం చేసే ధైర్యం రైతుకు రావడంలేదని చెప్పారు. ఇప్పటికైనా కన్నీరు కారుస్తున్న రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి 4వేల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు.