చంద్రబాబు అక్రమాస్తుల వ్యవహారంపై దర్యాప్తు సోమవారం నుంచి ప్రారంభమవుతుందని సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి 2,424 పేజీల అనుబంధ పత్రాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తరపున ఆమె ప్రతినిధులు సీబీఐకు సమర్పించారు.