Sunday, October 30, 2011

Roja Comments on Home Minister Sabitha Indra Reddy

video


                                        Roja Comments on Home Minister Sabitha Indra Reddy


 


రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మహిళలపై దాడులు పెరగడానికి చేతగాని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డే కారణమన్నారు. హోంమంత్రి ఉన్నా కేవలం ‘హోమ్’కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇటువంటి హోంమంత్రి ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని రోజా డిమాండ్ చేశారు