Ambati Rambabu comments on chandrababu naidu on 09/11/2011
ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు పాలకుల ఒళ్లో గుర్రుపెట్టి నిద్రపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అధికార కాంగ్రెస్‌తో అత్యంత సన్నిహితంగా మెలగుతూ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతానంటూ చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడడంలేదని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం పడిపోదని తెలిసిన తర్వాతే అవిశ్వాసం పెడతావా అంటూ నిలదీశారు.
భారతావని చరిత్రలో ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఎప్పుడూ లేదని అంబటి అన్నారు. గవర్నర్, స్పీకర్ ప్రభుత్వంతో లాలూచీ పడిన విచిత్ర పరిస్థితి రాష్ర్టంలో నెలకొందని అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతో జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య సంప్రదయాలను తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ సరిగా పనిచేసినా కిరణ్ సర్కార్ కూలడం ఖాయమని అంబటి అన్నారు