Mekapati Rajamohana Reddy Media meet @ YSR Congress Party Office
ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితో కచ్చితంగా తేడాలు వ స్తాయని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు మాట మార్చారని ఆయన గుర్తుచేశారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వ మనుగడకు ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదన్నారు. అవిశ్వాసం సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ఉండేలా చూడాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. శాసనసభ సమావేశాల్లో రైతు సమస్యలను వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు లేవనెత్తుతారని మేకపాటి తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుతీరుపై ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తారని చెప్పారు. మహానేత లేని కొరతను ప్రజలు ప్రతిక్షణం అనుభవిస్తున్నారని అన్నారు.