NARA LOKESH |
SUGUNA CHOWDARY |
RAMOJI RAO |
సుప్రీంలో బాబు బినామీలకు చుక్కెదురు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బాబు బినామీలు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్‌లకు చుక్కెదురైంది.
తె లుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్థులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశాలను నిలుపుచేయాలని నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ భండారీ, జస్టిస్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ నిరాకరించింది.
ప్రస్తుత సమయంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టులోనే తే ల్చుకోవాలని సుప్రీం కోర్టు బెంచ్ సూచించింది.
BAZIREDDY GOVARDHAN |
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినపుడు చంద్రబాబు విమర్శించారనీ ‘విచారణకు సిద్ధపడి నిజాయితీని నిరూపించుకోవాలి’ అని హితవు చెప్పారనీ బాజిరెడ్డి గుర్తు చేశారు. ఇపుడు అదే హితవును తాము బాబు, ఆయన బినామీలకు చెబుతున్నామని గోవర్థన్ అన్నారు. జగన్ విషయంలో బాబు ఒక మాట, తనదాకా వస్తే మరో మాట మాట్లాడ్డం ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా ఉందని అన్నారు. ఈ విచారణ జరిగితే తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని ఎదుర్కొనే దమ్ము లేక బాబు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నార నీ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఓ వైపు కుమ్మక్కు అవుతూ మరో వైపు సోనియా, ఆమె అల్లుడిపై కేసు వేస్తామంటూ మాట్లాడుతున్నారనీ బాజిరెడ్డి విమర్శించారు. అందుకే రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి ప్రభుత్వం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నిసార్ అహ్మద్ కక్రూ పేరును ప్రతిపాదించగానే వ్యతిరేకించకుండా పూర్తి మద్దతు నిచ్చారని బాజిరెడ్డి విమర్శించారు. నిసార్ అహ్మద్ కక్రూ తాను పదవీ విరమణ చేయడానికి కొద్ది రోజుల ముందు జగన్ ఆస్తులపై విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం ఏ పదవికి ఏ పేరును ప్రతిపాదించినా వ్యతిరేకించే బాబు ఇపుడు కక్రూను బలపర్చడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన అన్నారు. మైనారిటీ కనుకనే కక్రూను బలపరిచానని చెప్పిన బాబు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా జన్నత్ హుస్సేన్‌ను ఎందుకు వ్యతిరేకించారని ఆయన ప్రశ్నించారు. జన్నత్ మైనారిటీ కాదా అని ప్రశ్నించారు. తన ఆస్తుల విచారణపై ఆదేశాలు వెలువడగానే బాబు రైతు సమస్యల పేరుతో ఢిల్లీకి వెళ్లి అక్కడ జాతీయ నాయకుల మద్దతు కోసం తాపత్రయపడ్డారని ఆయన అన్నారు.
జగన్‌పై విచారణ జరుపుతున్నపుడు సీబీఐని చాలా మంచి సంస్థ అని బాబు పొగిడారనీ, ఇపుడు తనపై కూడా విచారణకు ఆదేశించేటప్పటికి స్వతంత్రంగా పనిచేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారనీ విమర్శించారు. జగన్ ఆస్తులపై వేసిన పిటిషన్‌కూ, బాబు ఆయన బినామీలపై విజయమ్మ వేసిన పిటిషన్‌కూ మౌలికంగా కొన్ని తేడాలున్నాయని ఆయన అన్నారు. మంత్రి పి.శంకర్‌రావు జగన్‌పై వేసిన పిటిషన్‌లో జతపర్చినవన్నీ కొన్ని పత్రికా క్లిప్పింగులు, ఆరోపణలు, టీడీపీ నాయకులు వై.ఎస్.ఆర్‌పై వేసిన పుస్తకం మాత్రమేననీ దాంట్లో టీడీపీ నేత కె.ఎర్రంనాయుడు జోక్యం చేసుకున్నారని ఆయన అన్నారు. కానీ విజయమ్మ తన పిటిషన్‌లో 2424 పేజీల సమాచారం ఇచ్చారనీ అందులో ఎన్నో ఆధారాలు హైకోర్టుకు సమర్పించారనీ బాజిరెడ్డి అన్నారు.
విజయమ్మ పిటిషన్‌లో తగినన్ని ఆధారాలు ఉన్నందుకే హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా సీబీఐ విచారణకు ఆదేశించిందని ఆయన అన్నారు.1978లో బాబు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులెన్ని? ఆ తరువాత టీడీపీలో చేరాక ఆస్తులెంత పెరిగాయి? తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏ రీతిలో తన బినామీలకు మేళ్లు చేశారు? వంటి అంశాలన్నీ విజయమ్మ పిటిషన్‌లో పూసగుచ్చినట్లు వివరించారని అన్నారు.