Wednesday, November 23, 2011

Wine Shops in Govt/ ‘ఫుల్లు’గా ప్రజాసేవ..!

Wine Shops in Govt

                              ‘ఫుల్లు’గా ప్రజాసేవ..!

లెసైన్సుల సంఖ్య పెంపు, విచ్చలవిడి బెల్టు షాపులతో రాష్ట్రంలో మద్యం ఏరులు పారిస్తున్న ప్రభుత్వం... ఇకపై తానే నేరుగా రంగంలోకి దిగి మరీ జనంతో చిత్తుగా తాగించే యోచన చేస్తోంది! మద్యం డీలర్ల అక్రమాలకు ముకుతాడు వేసే సాకుతో రిటైల్ వ్యాపారంలోకి దిగబోతోంది. గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే విధిగా మద్యం అమ్మాలంటే సాధ్యం కాదంటున్న డీలర్ల లెసైన్సు రద్దు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. వారు దిగి రాకుంటే ఆ దుకాణాల స్థానంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) సొంతంగా దుకాణాలను ప్రారంభించాలని తాజాగా భావిస్తోంది. దీనివల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న ఎక్సైజ్ శాఖ అభిప్రాయాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని, వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిందని సమాచారం. ఉన్నతాధికారులు ఒకట్రెండు రోజుల్లో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారని సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.
                                   
లెసైన్సుల కోసం భారీగా బిడ్లు దాఖలు చేసి ఆర్థికంగా నష్టపోయినందున ఎమ్మార్పీని అమలు చేయబోమంటూ మొండికేస్తున్న మద్యం డీలర్ల కట్టడికే ఈ కసరత్తు సాగుతోందని అధికారులు బయటికి చెపుతున్నారు. కానీ సర్కారే స్వయంగా రిటైల్ రంగంలో దిగితే ఎక్కువ ఆదాయం మూటగట్టుకోవచ్చన్నదే లోగుట్టని ఉన్నతాధికార వర్గాలు వివరిస్తున్నాయి. పలు కారణాలతో మూతబడ్డ మద్యం దుకాణాల స్థానంలో కొత్త వాటిని ప్రభుత్వమే తెరిచేలా కసరత్తు సాగుతోంది. ఎక్సైజ్ కమిషనర్‌కున్న విస్తృతాధికారాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. మూతబడ్డ
దుకాణాల వివరాలను వెంటనే తనకు పంపాల్సిందిగా జిల్లాల డిప్యూటీ కమిషనర్లను కమిషనర్ సమీర్ శర్మ ఇప్పటికే ఆదేశించారు. వాటిని ప్రభుత్వం తరఫున పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించడంతో ఎక్సైజ్ అధికారులు అలాంటి దుకాణాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇంకోవైపు, మరో ఆర్నెల్లలో మద్యం దుకాణాల లెసైన్స్ గడువు ముగుస్తుండటంతో, కొత్త ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం తరఫున దుకాణాలు తెరిపించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఎక్సైజ్ నిబంధనల్లో సవరణ: ఒకవైపు లిక్కర్‌పై వ్యాట్‌ను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకోవైపు సగటున twenty four శాతం దాకా ఉన్న రిటైలర్ మార్జిన్‌ను పెంచాలంటూ లిక్కర్ అసోసియేషన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలా పెంచినా ఎమ్మార్పీ ఉల్లంఘనలు ఆగబోవని ఎక్సైజ్ అధికారులంటున్నారు. ఒకేసారి వ్యాట్, రిటైలర్ మార్జిన్ పెంచితే వ్యతిరేకత వస్తుందని, ఎమ్మార్పీ ఉల్లంఘనలను ఆపాకే అలా పెంచాలని సూచిస్తున్నారు. దాంతో ప్రభుత్వం దిద్దుబాబు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఎక్సైజ్ నిబంధనల్లో కొన్ని సవరణలు చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే డీలర్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని, రెండోసారి పట్టుబడితే దుకాణం లెసైన్సు రద్దు చేయడంతో పాటు స్థానిక ఎక్సైజ్ సీఐని సస్పెండ్, లేదా బదిలీ చేయాలని నిర్ణయించారు.