Sunday, November 27, 2011

చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీబీఐ/ Cbi Filed Case on Chandrababu

చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీబీఐ/Cbi Filed Case on Chandrababu





హైదరాబాద్: అక్రమాస్తుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు సహా 12 మందిపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు చేసింది. భువనేశ్వరి, లోకేష్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, రామోజీరావు, నాగరాజ నాయుడు, 077; 129;ోబిలరావు, కేవీ రావు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్‌పై కేసులు నమోదు చేసింది.
                                                   


Cbi Filed Case on Chandrababu video

టీడీపీ అధినేత విదేశీ హోటల్, ఇతర వ్యాపారాలపైనా కన్ను
*చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రికార్డుల పరిశీలన

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల గుట్టును ర ట్టు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. ķ4;్రాథమిక విచారణలో భాగంగా చంద్రబాబు, ఆయన బినామీలపై శనివారం కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబు, మరో 12 మందిపై ప్రాథమిక విచారణ (పీఈ నెంబర్ 7/2011) కేసు నమోదు చేసినట్లు సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మినారాయణ వెల్లడించారు. మూడు నెలల్లోగా విచారణ పూర్తిచేసి, నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందిస్తామని చెప్పారు. హైకోర్టు నుంచి పిటిషనర్ కాపీలను తీసుకున్న సీబీఐ అధికారులు శుక్రవారం విచారణ ప్రారంభించారు.

శనివారం కేసు నమోదు చేశారు. నోటీసుల జారీకి రంగం సిద్ధం చేశారు. దీంతో సోమవారం నుంచి విచారణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. చంద్రబాబు, ఆయన భ;ార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతోపాటు చంద్రబాబు బినామీల ఆస్తులపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు వేర్వేరుగా విచారణ జరిపాలని హైకోర్టు ఈనెల 14వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా నివేదికను హైకోర్టుకు అందించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసి, విచారణను వేగవంతం చేయనుంది.

చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఐఎంజీబీ డెరైక్టర్ అహోబలరావు, వి.నాగరాజనాయుడు, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మధుకాన్ సుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు, టీడీపీ నేత మురళీమోహన్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ సి.ఎమ్.రమేశ్, ఉషోదయా ఎంటర్‌ప్రై జెస్, హెరిటేజ్ ఫుడ్స్‌పై సీబీఐ ప్రాథమిక విచారణ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఆయన బినామీలు, సంస్థలకు నోటీసులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించి సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పటికే ఉన్నతాధికారులు, చార్టెడ్ అకౌంటĺ2;ంట్లు, ఆķ0;ాయ పన్ను శాఖ నిపుణులతో చర్చించారు.
                                                         
రంగంలోకి సీబీఐ ప్రత్యేక బృందాలు
చంద్రబాబు, ఆయన బినామీల అక్రమ ఆస్తుల కేసు విచారణ కోసం సీబీఐ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే ఇవి పనిచేస్తాయి. సీబీఐ కేంద్ర కార్యాలయంతోపాటు చెన్నై, ముంబై యూనిట్‌ల నుంచి అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు. ప్రతి బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు. చంద్రబాబు, బినామీల ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని ఈ బృందాలు సేకరిస్తాయి. వారి నివాసాలు, సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తాయి.

చంద్రబాబు, ఆయన బినామీలకు మలేసియా, సింగపూర్‌లలో వాపారాలు, హోటల్‌పై సీబీఐ ఆరా తీయనుంది. ఇందుకోసం కొన్ని బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అక్రమాల గుట్టును రాబట్టేందుకు ప్రభుత్వ రికార్డులను కూడా పరిశీలించనున్నారు. ఈ రికార్డుల కోసం సీబీఐ 081;న్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదిని కలవనున్నారు.

కొనసాగుతున్న ఈడీ విచారణ
చంద్రబాబు, ఆయన బినామీలపై ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ, టీడీపీ ఉపాధ్యక్షుడు సి.ఎమ్.రమేష్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు వారంతా సమాధానం ఇవ్వాల్సి ఉంది. వారు అందించిన డాక్యుమెంట్లకు సంతృప్తి చెందకపోతే అదనపు సమాచారాన్ని కోరే అవకాశముంది. ఆ సమాచారం ఆధారంగా ఈడీ బృందాలు దర్యాప్తు జరుపుతాయి. దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి.

విదేశీ లావాదేవీలపై కూడా ఈడీ సమాచారాన్ని సేకరిస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్ విదేశాలలో చదువు కోసం చెల్లింపులు ఎలా జరిగాయి? ఎవరు చెల్లించారు? అనే కోణంలో పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తోంది. మలేసియా, సింగపూర్‌లలో చంద్రబాబు ఆస్తులు, ఆయన బినామీలు సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరులు పలు దేశాల్లో జరిపి;న ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఈడీ రాబట్టనుంది. కాకినాడ సీపోర్టు ప్రైవేటీక రణ వెనుక మారిషస్ కంపెనీల వ్యవహారంపైనా ఈడీ ఆరా తీస్తోంది.
chandrababu naidu corruption
                                                        

The Central Bureau of Investigation (CBI) on Saturday registered a case against Telugu Desam Party (TDP) president N. Chandrababu Naidu and 12 others including his wife, son and two of his party MPs for a preliminary inquiry into the allegations of amassing wealth illegally.

Notices are likely to be served on the respondents from Monday as the investigating agency was told to file its report in sealed cover within three months.

Preliminary enquiry

The case was registered following a direction from the Andhra Pradesh High Court on November 14 to take up a preliminary inquiry into the charges levelled against Mr. Naidu and others by Pulivendula MLA Y.S. Vijayamma, wife of late Y.S. Rajasekhara Reddy.

The Enforcement Directorate has already taken up initial probe against Mr. Naidu and some of the respondents under the Foreign Exchange Management Act (FEMA) on November 22.

After getting a copy of the bulky 2,000-odd pages petition filed by Ms. Vijayamma from the High Court on Friday, the CBI officials led by its Joint Director here, V.V. Lakshminarayana, were said to have gone through the charges levelled against the respondents in detail.

The JD camped in his office for more than eight hours from 12.45 p.m. on Saturday to complete the formalities of registering the case.

Official sources stated that the CBI would first serve notices on all the respondents seeking information about their financial transactions during the period 1994-2004, when Mr. Naidu was the Chief Minister of the State, and about their assets. After examining the information furnished by the respondents or their representatives, the CBI would again serve notices, if required, to summon them personally for additional information or clarifications.

Offences committed

In her petition, Ms. Vijayamma submitted:

“The offences committed by the respondents include those under the Prevention of Corruption Act, the Indian Penal Code, the Prevention of Money Laundering Act, FEMA, the Representation of the People Act, the AP Land Grabbing Act and the Benami Transactions (Prohibition) Act.”



For More News on Chandrababu Assests Case;

YS Vijayamma files petition in High Court against Chandra Babu






వేల కోట్ల నిరుపేద!.. చంద్రబాబు


Supreme rejects Chandrababu Binami`s (Cm ramesh.Nama nageswara rao,Ramoji rao) Plea


against CBI probe


Vijayamma Petition papers hand out to CBI




ED Notices to Lokesh,Sujana Chowdary